ముగించు

పరిశ్రమలు

జిల్లా పరిశ్రమల కేంద్రం :: నాగర్ కర్నూల్

1 .టి.యస్.ఐ.పాస్. యాక్ట్ 

జిల్లాలలో పరిశ్రమల అభివృద్దికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పరిశ్రమల కేంద్రం పాటుపడుచున్నది. పరిశ్రమలు స్థాపించుటకై కావలసిన వివిధ అనుమతులను తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధృవీకరణ విధాన చట్టం 2014 (TS-iPASS) ప్రకారం అనుమతులు నిర్దేశిత కాలపరిమితితో మంజూరు చేయడము జరుగుచున్నది.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పక్షం రోజులకు ఒక్క సారి అనుమతులు జారీకై సమీక్ష సమావేశము నిర్వహించబడును.

2.నూతన పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహకం విధానం (T –IDEA, T-PRIDE)

నూతన పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సహక విధానం  (T –IDEA, T-PRIDE)  క్రింద పరిశ్రమలకు పలురకాల రాయితీలు ఇవ్వడం జరుగుతున్నది.

ఈ T –IDEA  పథకము క్రింద జనరల్ క్యాటగిరి పారిశ్రామిక వేత్తలకు మరియు  T-PRIDE పథకము క్రింద ఎస్.సి., ఎస్.టి మరియు వికలాంగుల పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.

జిల్లా స్ధాయిలో  సూక్ష్మ పరిశ్రమలు స్ధాపనకు  ఉత్పత్తి రంగములలో రూ. 25.00 లక్షలు వరకు పెట్టుబడితో స్ధాపించిన యూనిట్లుకు మరియు సేవా రంగము విభాగమునకు రూ. 10.00 లక్షల పెట్టుబడితో స్ధాపించిన యూనిట్లుకు రాయితీలు మంజూరు చేయడము జరుగును.

ఈ రాయితీలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన District  Industries Promotion Committee (DIPC)  సమీక్ష సమావేశము నిర్వహించి మంజూరు చేస్తారు.

రాష్ట్ర స్ధాయిలో  చిన్న, భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు స్ధాపనకు లలో ఉత్పత్తి రంగములకు రూ. 25.00 లక్షలు పై పెట్టుబడితో స్ధాపించిన యూనిట్లుకు మరియు సేవా రంగము విభాగమునకు రూ. 10.00 లక్షల పై పెట్టుబడితో స్ధాపించిన యూనిట్లుకు రాష్ట్ర స్ధాయిలు రాయితీలు మంజూరు చేయడం జరుగుతున్నది.  జిల్లా జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ వారి యూనిట్ ను తనిఖీ చేసి యూనిట్ వివరములు ఆన్ లైన్ ద్వారా కమీషనర్, పరిశ్రమల శాఖ, హైద్రాబాద్ వారి రాయితీలు మంజూరుకై  పంపబడును.

3.జిల్లా స్ధాయి టాస్క్ ఫోర్స్ కమీటి.

ఖాధీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమిషన్ వారిచే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకంను  గ్రామీణా మరియు పట్టణ ప్రాంతములో జిల్లా పరిశ్రమల శాఖ వారి ద్వారా మంజూరు చేయబడును.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన,  జిల్లా స్ధాయి టాస్క్ ఫోర్స్ కమీటి వారిచే సమీక్ష సమావేశము నిర్వహించి (మౌఖిక పరిక్షలు నిర్వహించి) ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకంనకు అభ్యర్ధలు ఎంపిక చేస్తారు  మరియు ఎంపిక అయిన అభ్యర్ధుల జాబితాను సూక్ష్మ పరిశ్రమలు స్థాపించుటకు గాను బ్యాంకు ఋణము ముంజూరుకై మరియు యూనిట్ గ్రౌండింగ్ కోరుకు బ్యాంకులకు పంపించడము జరుగును.

ఈ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకంను  ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనవలేను.http://www.kviconline.gov.in/pmegpeportal.

కాంటాక్ట్ డీటెయిల్స్
వ. నెం పేరు హోదొ ఫోన్ నెం ఇ మెయిల్

1

టి. హన్ముంతు

జనరల్ మేనేజర్

9441902861

gmdic-ngkl-inds@telangana.gov.in

2

జి. సాయి కృష్ణ

ఐ.పి.ఓ.,

9441104079

 

3

జి. భాస్కర్ రెడ్డి

సీ.ఆ

9440687037