ముగించు

పౌర సరఫరాల శాఖ

పౌర సరఫరాల శాఖ బాధ్యతలలో ముఖ్యమైనది నిర్వహణ. ఇందులో భాగంగా ఆధార్ తో ముడిపడి నిత్యావసర సరుకుల పంపిణి అనగా బియ్యం, చక్కెర, కిరోసిన్ మరియు పప్పు దినుసులు ప్రజలకు సకాలములో 558 చౌకధర దుకాణము ద్వారా సబ్సిడీ ధరలకు పంపిణి జరగడంలో పర్యవేక్షణ బాధ్యతతో పాటు ఆహార భద్రత కార్డులను 234007 జారీచేయడం మరియు వినియోగదారుల సమస్యలు, నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణ, దీపం పధకం ద్వారా బీద మహిళలకు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడము మొదలైనవి.

విధులు:

  1. రేషన్ దుకాణాల ద్వార నిత్యావసర సరుకుల పంపిణి జరపడం మరియు ఇట్టి నిత్యావసర సరుకుల పంపిణి లో ఎలాంటి అవకతవకలకు అవకాశాలేని విధంగా రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ePoS) కంటి స్కానర్ (ఐరిస్) ద్వార తమ యొక్క కోటాను రేషన్ కార్డుదారుడు సరియిన తుకంతో పొందే విధంగా
  2. ప్రత్యక్షంగా రైతుల నుండి ఐ.కే.పి. మరియు పి.ఎ.సి ల ద్వారా సగటు మద్దతు ధరలకు వరిని సేకరించడం జరుగుతుంది.
  3. జిల్లాలోని తెలంగాణ సంక్షేమ హాస్టల్స్ మరియు అంగన్వాడి సెంటర్ మరియు పాఠశాలలకు మద్యహ్నభోజన పధకం ద్వార సన్న బియ్యం జారీచేయడం
  4.  అర్హలైన కుటుంబాలకి దీపామ్ కనెక్షన్ల కేటాయింపు చేయడం
  5.  వినియోగదారులకు అవగాహనను కల్పించడం కొరకు మార్చి 15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవము మరియు డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవము రోజులలో ప్రత్యేక సదస్సులు మరియు సెమినార్స్ ను నిర్వహిస్తుంది.
  6.  ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, తినదగిన నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువుల దొంగతనం, నల్ల మార్కెటింగ్, వైవిధ్యాలు మొదలైన వాటిపై తనిఖీ చేయడానికి ఎసెన్షియల్ కామోటిటీస్ యాక్ట్, 1955 క్రింద వివిధ కంట్రోల్ ఆర్డర్స్ అమలు చేసే చర్యలను నిర్వహిస్తుంది.
  7. ధరలు పర్యవేక్షణ మరియు వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం

ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ వివరాలు

క్రమ సం. డిప్యూటీ తహసిల్దార్ పేరు (ఎన్ఫోర్సు) ప్రధాన కార్యాలయం చరవాణి సంఖ్య.
1 నర్సింగ్ రావు  కల్వకుర్తి 9963555168
2 పి రామ్ మోహన్  నాగర్ కర్నూల్  941626288
3 జి రవి కుమార్  అచ్చంపేట్ 9951267887