మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్దుల శాఖ
మహిళా, శిశు,వికలాంగుల మరియు వయోవృద్దుల శాఖ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రింది కార్య కలాపాలు నిర్వహించబడుచున్నవి.
- అంగన్వాడి సేవా పథకము(ASS)
- బాలల పరిరక్షణ పథకము (ICPS),
- బాలసదనం, సఖి ( One Stop Centre )
- వికలాంగులకు ఎయిడ్స్ మరియు ఉపకరణాల పంపిణీ
- వికలాంగులకు వివాహ ప్రోత్సాహకం
- వికలాంగులకు ఆర్థిక సహాయం మరియు తల్లిదండ్రులు మరియు వయోవృద్దుల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2011 అమలు మొదలైనవి.
సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (అంగన్వాడి సేవలు): జిల్లలో ప్రస్తుతం (908) ప్రధాన అంగన్వాడీ యొక్క కేంద్రాలు మరియు(223 ) మినీ అంగన్వాడీ కేంద్రాలు (మొత్తం: 1131AWCs) మంజూరి అయినవి.
ఖాళీలు భర్తీ కై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషనలైజెషన్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. త్వరలో ఖాళీలు భర్తీ కై నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది.
క.సంఖ్య |
ప్రాజెక్ట్ పేరు
|
మొత్తం అంగన్వాడి కేంద్రాలు
|
పని చేస్తున్న సిబ్బంది
|
ఖాళీలు |
|||||
అంగన్వాడి టీచర్లు |
మినీ టీచర్లు |
ఆయాలు |
అంగన్వాడి టీచర్లు |
మినీ టీచర్లు |
ఆయాలు |
||||
|
|
మెయిన్ |
మినీ |
||||||
1 |
అచ్చంపేట్ |
138 |
57 |
129 |
43 |
125 |
9 |
14 |
13 |
2 |
బల్మూర్ |
134 |
45 |
130 |
26 |
114 |
4 |
19 |
20 |
3 |
కొల్లాపూర్ |
203 |
15 |
199 |
9 |
189 |
4 |
6 |
14 |
4 |
కల్వకుర్తి |
188 |
80 |
183 |
73 |
177 |
5 |
7 |
11 |
5 |
నాగర్ కర్నూల్ |
245 |
26 |
237 |
24 |
225 |
8 |
2 |
20 |
మొత్తం:- |
908 |
223 |
878 |
175 |
830 |
30 |
48 |
78 |
అంగన్వాడి సేవలు :
- శిశు సంరక్షణ, అభివృద్ధి మరియు విద్య.
- సంరక్షణ మరియు పోషణ సలహాలు
- ఆరోగ్య సేవలు
- కమ్యూనిటీ సమీకరణ, అవగాహన, మరియు సమాచారం.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం ఐసిడిఎస్ లబ్ధిదారులు :
గర్భిణీ & పాలిచ్చే మహిళలు |
0-6 0-6 సంవత్సరాల పిల్లలు |
10125 |
37388 |
ఆరోగ్య లక్ష్మి:
గర్భిణీ & బాలింతలలో పోషక స్థితి మెరుగు లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం ఆరోగ్య లక్ష్మి ద్వారా”ఒక పూట సంపూర్ణ భోజనం” అందిస్తున్నది.
ఇట్టి కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా నందు జనవరి 2015 నుండి అమలులో వుంది.
ప్రాజెక్ట్ వారీగా లబ్భిదారులు:-
ప్రాజెక్ట్ వారీగా లబ్భిదారులు:-
క. సంఖ్య |
ప్రాజెక్ట్ పేరు |
ఆరోగ్యలక్ష్మిలో లబ్ధిదారులు |
|||
గర్భిణీలు |
బాలింతలు |
6M-3yrs పిల్లలు |
3-6 yrs పిల్లలు |
||
1 |
అచ్చoపేట్ |
865 |
678 |
3426 |
2411 |
2 |
బల్మూర్ |
659 |
590 |
2567 |
1774 |
3 |
కల్వకుర్తి |
992 |
768 |
4332 |
2716 |
4 |
కొల్లాపూర్ |
1192 |
1108 |
5103 |
3499 |
5 |
నాగర్ కర్నూల్ |
1739 |
1534 |
7498 |
4062 |
మొత్తం:- |
5447 |
4678 |
22926 |
14462 |
ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా లబ్దిదారులు పొందేవి :
- ప్రతిరోజూ ఒక పూట భోజనముతో పాటు గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులందరికీ ఒక ఉడకబెట్టిన
కోడి గుడ్డు మరియు 200 మి.లీ పాలు ఇస్తారు. - 7 నె – 3 సం|| పిల్లలకు వారానికి 4 గుడ్లు మరియు 2.5 kgs బలామృతం ఇంటికి ఇస్తారు.
- 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రతిరోజూ ఒక పూట భోజనం కాకుండా ఉడకబెట్టిన కోడి గుడ్డు,
పౌష్టిక విలువ గల తినుబండారo (స్నాక్స్) ఇవ్వబడును.
జిల్లాలోని అన్నీ అంగన్వాడి కేంద్రాలకు నేరుగా పాలు, కందిపప్పును HACA, నూనెను ఆయిల్ఫెడ్, బియ్యంను సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ వారు సరఫరా చెస్తున్నారు. కోడి గుడ్లను నాగర్ కర్నూల్ జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ (టెండర్ ద్వారా ఎంపికైన) సరఫరా చేస్తునారు. ఈ సరఫరాలన్ని కూడా బయోమెట్రిక్ సంతకం ద్వారా జరుగుతున్నాయి. ఇందు వల్ల అక్రమాలకు తావు లేకుండా ఉంటుంది.
పోషణ్ అభియాన్ :
సంపూర్ణ పోషణ సందేశం ప్రతి ఇంటికి చేరుకోవడమే లక్ష్యంగా మార్చి, 2018 నుండి పోషణ అభియాన్ జిల్లాలో అమలు చేయబడుతోంది. పోషణ్ అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యాలు
1. పిల్లలలో కురచదనాన్ని తగ్గించడం.
2. పిల్లలలో లోప పోషణ తగ్గించడం
3. చిన్న పిల్లలు, మహిళలు మరియు కౌమార బాలికలలో రక్తహీనతను తగ్గించడం
4. తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం.
ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యుఎస్, ఆహార, ప్రజా పంపిణీ శాఖల సమన్వయ౦తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాo.
సమగ్ర బాలల సంరక్షణ పథకము (ICPS) : –
సంరక్షణ మరియు రక్షణ అవసరమయ్యే 0 – 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలను రక్షించడానికి జిల్లలో ఐ.సి.పి.ఎస్ నిర్వహించబడుచున్నది.
- సంరక్షణ మరియు రక్షణ అవసరమయ్యే పిల్లలందరికీ, బాల నేరస్తులుగా ఉన్న పిల్లల సంరక్షణ మరియు రక్షణ అందించడం దీని లక్ష్యం.
- క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల శ్రేయస్సు మెరుగుదలలకు దోహదం చేయడం
- బాల్యాన్ని దుర్వినియోగం, నిర్లక్ష్యం, దోపిడీ దారితీసే పరిస్థితుల పై చర్య తీసుకుని
పిల్లలను రక్షించటo.
జిల్లాలో పిల్లల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోనైనది. వేరు వేరు కార్యాలయాలుగా పని చేస్తున్న ఐ.సి.డి.ఎస్, బాలల సంక్షేమ కమిటీ, 1098 హెల్ప్ లైన్ , జే. జే.బి అన్నీకలపి “బాల రక్షా భవన్”
పేరుతో ఒకే కార్యాలయంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తునాం. జిల్లా బాలల సంక్షేమ కమిటీ , జే. జే.బి లో సభ్యుల నియామకానికి దరకాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైనది. త్వరలో సభ్యుల నియామకం రాష్ట ప్రభుత్వం ద్వారా పూర్తి చేయబడును.
బాలల పరిరక్షణకై అందించే సేవలన్నింటిని ఒక్క గొడుగు క్రిందికి తీసుకువస్తూ జిల్లాలో బాలరక్షా భవన్ ను ఏర్పాటు చేయడం జరిగినది. ICPC ద్వారా ఇప్పటివరకు 103 బాల్య వివాహాలను ఆపడం జరిగింది.
చిల్ద్రెన్ హోం (బాల సదనం) :
అచ్చ౦పెట్‌లో చిల్డ్రన్ హోమ్ పనిచేస్తోంది. అనాధ మరియు పాక్షిక అనాధ బాలికలను బాల సదనం లో చేర్చి వారికి ఉచిత వసతి కల్పిస్తారు. వారికి పాఠశాల విద్యను అందిస్తారు. 10 వ తరగతి పూర్తయ్యే వరకు వారికి బస కొనసాగుతుంది . 10 వతరగతి పూర్తయిన తరువాత వారిని కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ కాలేజియేట్ హోమ్‌కు పంపుతారు. ప్రస్తుతం 30 మంది బాలికలు వసతి పొందుతునారు.
వికలాంగుల సంక్షేమం :
జిల్లా ఏర్పడిన తరువాత అవసరమైన వికలాంగులకు ఈ క్రింది సహాయాలు పంపిణీ చేయబడ్డాయి
క.సంఖ్య |
సహాయం పేరు |
పంపిణీ చేయబడినవి |
ఫైనషియల్ (లక్షల్లో) రూ. |
1 |
మూడు చక్ర్రాల సైకిల్
|
50 |
3.00 3.00 |
2 |
సంక కర్రలు |
30 |
0.45 0.45 |
3 |
ల్యాప్టాప్లు |
9 |
5.40 5.40 |
4 |
హియరింగ్ ఎయిడ్ |
25 |
1.00 1.00 |
5 |
మోటరైజ్డ్ వాహనాలు |
17 |
1 12.75 |
6 |
4 జి మొబైల్స్ |
10 |
1.00 1.00 |
7 |
చక్రాల కుర్చీలు |
50 |
2.40 2.40 |
వివాహ ప్రోత్సాహకాలు: –
ఇప్పటి వరకు 142 జంటలకు రూ .1,02,00,000-00 మంజూరు చేయడమైనది. వికలాంగుడిని వివాహం చేసుకున్న సాధారణ వ్యక్తికి వివాహ ప్రోత్సాహకంగా ఒక లక్ష రూపాయలు మంజూరు చేయబడుతోంది.
ఆర్థిక సహాయం:-
స్వయం ఉపాధి కార్యక్రమాల ఏర్పాటుకు ఇప్పటి వరకు 40 మంది వికలాంగులకు సబ్సిడీగా రూ .55 లక్షలు మంజూరు చేయడమైనది.
సీనియర్ సిటిజన్ల సంక్షేమం :
రెవెన్యూ డివిజనల్ వారీగా ట్రిబ్యునళ్ళు ఎర్పాటు చేయనైనది. ప్రభుత్వం నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో జిల్లాలో 3 వృద్ధాప్య గృహాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి.
సఖి (One Stop Centre): –
సఖి (OSC), నాగర్ కర్నూల్ 8-3-2019 నుండి కేంద్ర మరియు రాష్ట్ర నిధులతో పనిచేయడం ప్రారంభించింది. గృహ హింస ఇంకా అనేక కారణాలతో సమస్యలను ఎదుర్కుంటున్న మహిళలకు తాత్కాలిక వసతి, కౌన్సిలింగ్, వైద్య మరియు న్యాయ సలహా కోసం ఈ సఖి (One Stop Centre) కేంద్రం పనిచేస్తున్నది. అత్యాచారాలకు గురైన, మోసానికి గురైన, లైంగిక వేదింపులకు గురైన మహిళకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు సఖి కేంద్రం అందిస్తుంది.ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు.
1. గృహ హింస కేసు : 152
2. మోసం కేసులు : 10
3. తప్పిపోయిన కేసులు : 13
4. బాల్య వివాహ కేసులు : 7
జిల్లలో సఖి కేంద్రం గురిoచి అందరికి తెలియడానికి అవగాహన సమావేశాలు కుడా నిర్వహిస్తునారు.
అత్యాచారానికి గురైన బాలికలకు, మహిళల లకు ఆర్ధిక సాయం:- జిల్లాలోని అత్యాచారానికి గురైన బాలికలకు, మహిళల లకు ఆర్ధిక సహాయం చేయుచున్నాము. ఇప్పటి వరకు 33 లక్షలు మంజూరి చేయనైనది.